కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి తల, మొండెం వేరుపడ్డాయి. రైల్వే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.