భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నియోజకవర్గానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, SRT, మాయాబజార్ భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడవద్దని, రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో మరో 1500 అదనంగా ఇండ్లకు జాబితా తయారు చేయాలన్నారు.