కొత్తగూడెం: కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి, జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. గురువారం కొత్తగూడెంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 8 గంటల పనిదినం కోసం చికాగో నగర వీధుల్లో కార్మికులు చిందించిన రక్తం వృధా కాలేదని అన్నారు. ఈ పిలుపుతో కార్మికుల దినోత్సవ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్