కొత్తగూడెం సింగరేణిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాతపరీక్ష జరిగింది. 33 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 31 మందికి గాను 26 మంది, 16 సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 39 మందికి గాను 36 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణను జీఎం పర్సనల్ కిరణ్ కుమార్ పర్యవేక్షించారు.