కొత్తగూడెం: యాసంగి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలి

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1, 87, 309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఉందని, దీనికి అనుగుణంగా 168 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులందరికీ కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్