లక్ష్మీదేవిపల్లి: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇంట్లో చోరీ

లక్ష్మీదేవిపల్లి మండలంలోని సాయినగర్ ఏరియాలో శనివారం గుర్తు తెలియని దుండగుడు హాల్ చల్ చేశాడు. యధావిధిగా రోజువారీ లాగే పద్మావతి తన కొడుకులు ఇద్దరు స్కూల్ కు వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలకోట్టి ఉండడం ఇంట్లో ఉన్న బీరువా తీసివుండడంతో ఇంట్లో చోరీ పాల్పడినట్లు గుర్తించారు. బీరువాలో పెట్టిన 15 తులాల బంగారం, జత వెండి పట్టీలు, 25 వేల నగదు చోరీ జరిగిందని నిర్ధారించుకొని ఆదివారం పోలీసులకు సమాచారం అందజేశారు.

సంబంధిత పోస్ట్