సహకార బ్యాంకు ద్వారా రైతులకు లోన్లు

పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు బుధవారం సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, పాల్వంచ మండలంలోని రైతులకు కేంద్ర సహకార బ్యాంక్ (DCCB) ద్వారా ఎకరానికి రూ. 5 లక్షల వరకు 10.5% వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు అందించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు, సహకార బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕