భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి హత్య కేసులో నిందితులను శిక్షించాలని, బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో నర్సింగ్ చదువుతున్న హరిణి, ఇటీవల లోతువాగులోని బంధువుల ఇంటికి వచ్చి వెళ్లిన మరుసటి రోజే దారుణ హత్యకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, మృతదేహాన్నిబుధవారం పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.