ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరికొద్ది సేపట్లో పాల్వంచకు రానున్నారు. ఆమె ముందుగా బీఆర్ఎస్ నాయకురాలు సింధు తపస్వి నివాసాన్ని సందర్శిస్తారు. అనంతరం పెద్దమ్మతల్లి ఆలయంలో దర్శనం చేస్తారు. తరువాత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పరామర్శించనున్నారు.