అమ్మ దీవెనలే మానవాళికి శ్రీరామరక్ష: కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాత పాల్వంచలోని మైసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సోమవారం కర్ర పూజ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మల దీవెనలే మానవాళికి శ్రీరామరక్ష అని అన్నారు. అక్టోబర్ 11 నుంచి 24 వరకు జరిగే నవరాత్రి మహోత్సవాల కోసం ఈ కర్ర పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్వాలతో పాటు కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕