భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలోని ఒక పెట్రోల్ బంకులో డీజిల్ నిల్వలు ఉన్నా, కావాలనే వాహనదారులకు పోయడం లేదని ఆరోపిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ టిన్నులతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, వాహనదారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటన కొత్తగూడెం, పినపాక ప్రాంతాలలో చోటుచేసుకుంది.