గిరిజన ప్రాంతాలలోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో పాల్వంచ మండలం కోయగట్టు గ్రామంలో కొత్త ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) వెంకటేశ్వర చారి గురువారం ప్రారంభించారు. ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకొని, తమ పిల్లలను బడికి పంపాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఉపాధ్యాయులు సైతం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు.