పాల్వంచ మండలంలోని జగన్నాధపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పరామర్శించారు. క్షతగాత్రులతో ఆయన మాట్లాడి, వారికి భరోసానిచ్చారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు.