లక్ష్మీదేవి పల్లి(ఎస్)కి చెందిన తేజ తన ద్విచక్రవాహనంపై మంగళవారం వేగంగా వెళ్తున్నారు. ఆ వీధిలో ఉన్న రాములమ్మ ఎందుకలా వెళ్తున్నావని అసభ్య పదజాలంతో దూషించడంతో ఇరువురికి వాగ్వాదం జరిగింది. తేజ ఆయన కుటుంబీకులు రాములమ్మను ఎందుకు తిట్టావని ప్రశ్నించారు. రాములమ్మ కుటుంబీకులు ఆరుగురు వచ్చి తేజ కుటుంబీకులపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆరుగురిపై పాల్వంచ ఎస్సై కేసు నమోదు చేశారు.