పాల్వంచ మండలంలోని పునుకుల, నాగారం, తోగ్గూడెం, జగన్నాధపురం గ్రామాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గతనెల 27న దుండగులు ధ్వంసం చేసి, సుమారు 40 కిలోల కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 20 వేలకు పైగానే ఉంటుందని విద్యుత్శాఖ రూరల్ ఏఈ రవీందర్ తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.