పేదలు, శ్రామికులకు ఎర్రజెండానే అండ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచలో శనివారం జరిగిన సీపీఐ పట్టణ 19వ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. సీపీఐ వందేళ్ల చరిత్రలో అనేక పోరాటాలు చేసిందని, ప్రజల హక్కుల కోసం రాజీలేని ఉద్యమాలు చేసిందని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.