అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. సీజన్ ప్రారంభం నుంచే వర్షాల వల్ల పంట నష్టం జరిగిందని తెలిపారు.