పాల్వంచ పట్టణం ఒడ్డుగూడెంకు చెందిన ముదికొండ కోటేశ్వరరావు (59), చంద్రుగొండ మండలం మద్దుకూరులో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గుండెపోటుతో ఈనెల 7న మరణించగా, మృతదేహాన్ని మూడు రోజుల పాటు మార్చురీలో ఉంచారు. కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన పెద్ద కుమార్తె నవ్య శుక్రవారం ఉదయం చేరుకొని, తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి, తలకొరివి పెట్టి రుణాన్ని తీర్చుకుంది.