పాల్వంచ మండలంలోని జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో జూలై 11న ఎస్పీఎల్ ఎన్నికలు ప్రజాస్వామ్య విధానంలో నిర్వహించారు. 187 మంది విద్యార్థులు ఆధార్‌తో ఓటు వేశారు. 67 ఓట్లు సాధించిన లకావత్ చరణ్ ఎస్పీఎల్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సహకారంతో నిర్వహించారు.