నవంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్‌లో శనివారం అమరవీరుల సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ, భూమి, భుక్తి, దేశ విముక్తి కోసం ఎంతోమంది అమరవీరులయ్యారని, వారి ఆశయాలను సాధించుకోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా సాక్షిగా ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని ఆయన అన్నారు.