పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ స్పోర్ట్స్ స్టేడియంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన యోగా శిక్షణ, ఆటల పోటీలను మున్సిపల్ కమిషనర్ సుజాత ప్రారంభించారు. యోగా ద్వారా మానసిక దృఢత్వం, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.