మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని పాల్వంచలో ఫ్లయింగ్ స్క్వాడ్ బుధవారం తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా చేపట్టిన ఈ తనిఖీలకు ఎంపీ వద్దిరాజు పూర్తిస్థాయిలో సహకరించారు. నిబంధనల ప్రకారం అధికారులు తమ విధులను నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.