కొత్తగూడెం కేంద్రంలో పెట్రోల్, డీజిల్ కొరత

కొత్తగూడెం కేంద్రంలో సోమవారం పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. పలు పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పారిశ్రామిక ప్రాంతమైన జిల్లాపైన ఈ కొరత ప్రభావం పడింది. జిల్లా కేంద్రంలోని నాలుగు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్