అశ్వాపురం మండలంలోని సీతారామ మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకాన్ని బుధవారం రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, అధికారులు, స్థానిక రైతులు, ప్రజలు, నాయకులు, సర్పంచులు, తహశీల్దార్, ఎంపిడిఓ సమక్షంలో మోటర్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.