పాల్వంచ రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్‌లో కాలువలు పూడుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుండటంతో కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. దోమలు, ఈగలతో రోగాలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే కాలువలు శుభ్రం చేసి, చెత్త తొలగించాలని కోరుతున్నారు.