సారపాకలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8:00 గంటల నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సారపాక విద్యుత్ కార్యాలయంలో 33 కేవీ నూతన బ్రేకర్ ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ అంతరాయం కలుగుతుంది. దీనివల్ల సారపాక, మోతే, ఇరవైండి ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ప్రభావితమవుతారు. ప్రజలు తమ విద్యుత్ సంబంధిత పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సారపాక విద్యుత్ శాఖ అధికారులు సోమవారం సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕