తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానాలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు. ఈ నేపథ్యంలో, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.