సుజాతనగర్ లో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు

సుజాతనగర్ ప్రధాన రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. రోడ్డు పక్కన అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పెద్ద ఫ్లెక్సీ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్