భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా మత సామరస్య దినోత్సవ సభ శుక్రవారం జరిగింది. ఈ సభలో సాబీర్ పాషా బాపూజీకి నివాళులర్పించి, పూలమాలలు వేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేశారు.