బీసీఎం రోడ్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ బీసీఎం రోడ్డులో మురికి కాలువలో భారీగా చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోవర్ధనగిరి కాలనీ నుంచి వచ్చే మురుగు నీరు ముందుకు వెళ్లలేక నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్