భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శనంలో రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వర్షాకాలాన్ని ఉపయోగించుకుని గరీబ్‌పేట్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో టేకు, చింత, గానుగ, వేప, పనస విత్తనాలను సోమవారం చల్లారు. అటవీ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.