భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సోమవారం సందర్శించారు. హెడ్ క్వార్టర్స్ లో చేపట్టనున్న అభివృద్ధి, మరమ్మతుల పనులను ఆయన పరిశీలించారు. డాగ్ కెన్నెల్, బీడీ టీమ్ లను ఏర్పాటు చేయడానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.