భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పోలీస్ స్టేషన్లో ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ మంగళవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించి, కేసులను త్వరగా పరిష్కరించాలని, సీసీటీఎన్ఎస్ 2.0లో వివరాలను సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తనిఖీలో సీఐ తిరుపతి, ఎస్ఐ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.