భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితాలు అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు తమ పేరు, వయసు, చిరునామా వివరాలను పరిశీలించుకోవాలని, కొత్తగా 18 ఏళ్లు నిండినవారు, చిరునామా మార్చుకున్నవారు జాబితాను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. చేర్పులు, తొలగింపులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.