బూర్గంపాడ్ మండల లో తుఫాన్ బీభత్సం

బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో బుధవారం ఆర్నాభ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. మెయిన్ రోడ్ సెంటర్లో ఒక్కసారిగా చుట్టూ చీకట్లు కమ్ముకుని, భారీ దుమ్ము, నల్లటి మేఘాలతో భయానక వాతావరణం నెలకొంది. తుఫాన్ ధాటికి చెట్లు, ఇంటి రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. అక్కడున్న కొందరు వ్యక్తులు కూడా గాలికి కొంతదూరం నెట్టబడ్డారని బాధితులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ చిన్న గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕