సుజాతనగర్ మండలం వేపలగడ్డ ఎదుళ్ల వాగు స్మశాన వాటిక అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారిందని సీపీఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ ఆరోపించారు. శనివారం ఇసుక తోలుతున్న ప్రదేశాన్ని వారు పరిశీలించారు. గతంలో ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయగా 2016లో స్మశాన వాటిక స్థలంలో హద్దులు ఏర్పాటు చేశారని చెప్పారు. గత రెండు రోజుల నుంచి నెంబర్ ప్లేట్ లేని జెసీబీ, ట్రాక్టర్ల సాయంతో పట్టపగలే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలిపారు.