రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ డిమాండ్ చేశారు. గురువారం సుజాతనగర్ లోని సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, వడ్లు కొనే విధానాన్ని, కాటాలను పరిశీలించారు. వివిధ పరీక్షల పేరుతో, నిబంధనల పేరుతో వడ్లు కొనుగోలులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.