శేఖరం బంజర స్కూల్లో టీచర్లను భర్తీ చేయాలి..కుమార్

పాల్వంచ మండలం శేఖరం బంజర స్కూల్లో టీచర్ల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, తెలుగు, హిందీ, గణితం సబ్జెక్టులకు వెంటనే టీచర్లను కేటాయించాలని లంబాడి హక్కుల పోరాట సమితి జనరల్ సెక్రెటరీ ఇస్లావత్ కుమార్ నాయక్ సోమవారం  డిమాండ్ చేశారు. తక్షణమే టీచర్లను కేటాయించని పక్షంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఇంచార్జ్ అధికారి, DEO లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు నాయక్, రోహిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్