భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అమ్మవారి దీవెనలే శ్రీరామరక్ష అని అన్నారు. పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ బొల్లోరిగూడెంలో శనివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీం ఆదిశక్తి దుర్గామాత కమిటీ, దుర్గాదేవి నవరాత్రుల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, మాలంపాటి భవిత, కొండ వెంకన్న గౌడ్ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు.