భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం, కారుకొండ రామవరం గుట్టపై ఉన్న క్రీస్తు శకం 1 నుంచి 8వ శతాబ్దానికి చెందిన ప్రాచీన బౌద్ధ స్థూపాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. మహాయాన బౌద్ధ శాఖకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ లభించాయని చరిత్రకారులు భావిస్తున్నారు. గతంలో అధికారులు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించకపోవడంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందలేదు. ఈ చారిత్రాత్మక స్థూపాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.