మొక్కల రాజశేఖర్‌కు టీపీసీసీ నేతల ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో మొక్కల రాజశేఖర్‌ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్యతో కలిసిబుధవారం ఘనంగా సన్మానించారు. హరిత విప్లవమే ధ్యేయంగా గత ఆరేళ్లుగా ప్రతి రోజు ఒక మొక్క నాటుతూ, ప్రధానమంత్రి మోడీ ద్వారా మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్న మొక్కల రాజశేఖర్ ను సన్మానించారు. "మొక్కను రక్షించు – మాతృభాషను రక్షించు" అనే నినాదంతో సింగరేణి ఉద్యోగం చేస్తూనే, తన తండ్రి పాండు ఇచ్చిన స్పూర్తితో రోజుకో మొక్క నాటుతూ మొక్కల రాజశేఖర్ గా పేరు తెచ్చుకున్న కొట్టూరు నుర్విని సన్మానించారు.

సంబంధిత పోస్ట్