కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీయూసీఐ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ ఆసుపత్రి, హమాలీ, ఆశా, అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడం లేదని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్