కొత్తగూడెం పట్టణంలోని నటరాజ్ సెంటర్ వద్దమంగళవారం రెండు బైక్లు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గణేష్ మండపం సందర్శనకు వెళ్తుండగా, పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రమాదం జరిగినప్పటికీ, పోలీసులు ఘటనపై దృష్టి పెట్టకుండా మంత్రి బందోబస్తుకే ప్రాధాన్యత ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.