కొత్తగూడెం పట్టణంలో రేపు నిర్వహించే న్యూడెమోక్రసీ జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోత్ ఊక్లా అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని స్థానికంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ నిర్మాణంపై జరిగే సమావేశంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.