మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20 రోజులుగా నీళ్లు బంద్ !

కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని పాల్వంచ పట్టణం రాహూల్​గాంధీ నగర్​లో 20 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పైప్​లైన్లు పగిలి నీళ్లు వృథాగా పోతున్నా కార్పొరేషన్​ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాగునీటితో పాటు ఇంటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎమ్మెల్యే, మేయర్​ స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్