ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు 15 రోజుల్లో చెల్లిస్తాం..మంత్రి పొంగులేటి

జనగామ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నిర్మాణం పూర్తయిన 1.80 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని ఆదివారం తెలిపారు. లంచం లేకుండా ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని, కేంద్రం ఇంటికి రూ.72వేలు ఇస్తామని చెప్పి, పదేపదే అడిగిన తర్వాత ఇటీవల 2 లక్షల ఇళ్లకు మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లకు రూ.2-3 లక్షలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕