పాల్వంచ: ఆరోగ్య కేంద్రాల్లో కిట్ల కొరత లేకుండా చూడాలి

మంగళవారం పాల్వంచలోని తన కార్యాలయంలో డీఎంహెచ్ఓ డా.తుకారాం రాథోడ్, డీపీఎంఓలు, ఫార్మసీ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లతో జూమ్‌లో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, ఆర్‌డీటీ, హెచ్‌ఐవీ, సిఫిలిస్, డెంగ్యూ రాపిడ్ టెస్ట్ కిట్ల నిల్వలను ఆయన పరిశీలించారు. కిట్ల కొరత ఏర్పడితే వెంటనే ఈ-ఔషధి పోర్టల్‌లో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో ఫార్మ్‌లను అప్‌డేట్ చేయాలని సిబ్బందిని సూచించారు.

సంబంధిత పోస్ట్