మణుగూరు ఏరియాలో 103 శాతం బొగ్గు ఉత్పత్తి

మణుగూరు సింగరేణి కాలరీస్ ఏరియా ఏప్రిల్ మాసానికి నిర్దేశించిన 9.58 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 9.85 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి, 103 శాతం విజయం సాధించినట్లు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ గురువారం తెలిపారు. ఏప్రిల్లో ఓబీ వెలికితీతలో 12 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 10.83 లక్షల క్యూబిక్ మీటర్లు, అంటే 90 శాతం వెలికితీశామని, అలాగే 10.1 లక్షల టన్నుల బొగ్గును పలు మార్గాల ద్వారా రవాణా చేశామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్