భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో జూన్ నెలలో 6 లక్షల 48 వేల 500 టన్నుల లక్ష్యానికి గాను 11 లక్షల 67 వేల 882 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 171 శాతం లక్ష్యాన్ని అధిగమించినట్లు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మంగళవారం తెలిపారు.జూన్ మాసంలో మొత్తం 11 లక్షల 44 వేల 812 టన్నుల బొగ్గును రైల్వే, రోడ్డు, రోప్‌వే మార్గాల ద్వారా రవాణా చేశారు.