అశ్వాపురం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని శనివారం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని సంఘం నాయకులు పేర్కొన్నారు. మహిళా లోకానికి ఐలమ్మ ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.